విజయనగరం, ఏప్రిల్ 13 (జనస్వరం) : జనసేన పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. డా.రవికుమార్ మిడతాన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ & వై.ఎస్.జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మద్యం కుంభకోణంపై విచారణ జరిపితే దేశంలో అతిపెద్ద కుంభకోణంగా అవతరిస్తుంది అని, మద్యపాన నిషేధం అంటూ ఊదరగొట్టి చివరికి మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని, నాసిరకం మద్యాన్ని పేదలకు అధిక ధరలకు అమ్ముతూ వారి రక్తం మాంసాలతో ఖజానా నింపుకొని, నగదు రహిత లావాదేవీలను అనుమతించకుండా అధిక ధరలకు అమ్మిన సొమ్మును ఎన్నికలకు ట్రక్కుల్లో నియోజకవర్గాలకు తరలించివేశారు. అమ్మకాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ లనుండి తొలగించివేస్తున్నారు. అయినా మదర్ బోర్డులో నిక్షిప్తం అయివుంటుంది కావున అక్రమార్కులు తప్పించుకోలేరు. తొందర్లోనే మద్యం పాలసీ కుట్రపై మద్యం మాఫియా అక్రమాలపై దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మద్యం కుట్రకు మూల్యం చెల్లించుకోక తప్పదు, జైలుకు వెళ్లక తప్పదు,‘‘జే" బ్రాండ్ చీప్ లిక్కర్ తయారీ సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి బినామీలవే. ఎన్నికల్లో మద్యాన్ని పంచేందుకు వైసీపీ నేతలు అక్రమంగా దాచి ఉంచారు. మద్యపాన నిషేధమని చెప్పి ఏటా వేలకోట్ల ఆదాయం పెంచుకుని డి-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయకుండా మహిళల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గమైన, నీచమైన పాలనకు మహిళలే చరమగీతం పాడుతారు. ప్రమాదకరమైన 'J' బ్రాండ్ మద్యం వలన చిద్రమైన కుటుంబాల శోకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శాపాలు కాబోతున్నాయి అని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com