తిరుపతి, ఏప్రిల్ 16 (జనస్వరం) : తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం సంబందించి జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1500 TDA ఇళ్లకు గాను 342 మాత్రమే ఇచ్చారని మిగతా పేద ప్రజలకు అన్యాయం చేసారని కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు తెలియజేసారు. అలాగే NDA ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులందరికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కుంబకోణంలో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని వారికి తగిన బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన ప్రజలకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ జనసేన, టీడీపీ, బీజేపీఉమ్మడి నాయకులు అందరూ పాల్గొన్నారు.