నూజివీడు ( జనస్వరం ) : సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నూజివీడు నియోజకవర్గ జనసేన నేత, సెంట్రల్ ఆంధ్ర జనసేన పార్టీ కమిటీ సభ్యులు పాశం నాగబాబు అన్నారు. రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో ఫోటో కవరేజ్ కి వెళ్ళిన సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైసిపి నాయకుల, కార్యకర్తల మూకమ్మడి దాడి సమాజంలో చాలా దారుణమని అన్నారు. ఇంకా జర్నలిస్టులపైనే దాడి చేస్తే ఇంకా రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా అర్థం అవుతుంది అని, తక్షణమే జర్నలిస్టు కృష్ణపై దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టు అనేవారు అన్ని పార్టీల సమావేశాలకు వెళ్ళవచ్చని, అన్ని న్యూస్ కవర్ చేసుకోవచ్చని, కానీ వైసీపీ సిద్ధం బహిరంగ సభలో ఫోటోలు తీయడానికి వెళుతున్న జర్నలిస్ట్ కృష్ణ పై ఈ విధంగా వైసీపీ నాయకులు దాడి చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని అన్నారు. రాప్తాడు సిద్ధం బహిరంగ సభకు దాదాపు 450 కిలోమీటర్ల దూరం నుండి కూడా ప్రజల్ని ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారని అన్నారు. ఎన్ని లక్షల మంది ప్రజలను తరలించిన, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఏ విధంగా జనాన్ని తరలిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని, జనాలను చూపించి ఓట్లు అడుగుదాము ఉద్దేశంతో ప్రస్తుత పాలకులు ఉన్నారని, కానీ రాష్ట్రంలో ప్రజలంతా కూడా జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారం లో కి తీసుకురావడానికి డిసైడ్ అయి ఉన్నారని, ఏ విధంగా జనాలను తరలించి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని ఆమె అన్నారు. మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరని నాగబాబు అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com