పుంగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ పుంగనూరు నియోజగవర్గ జనసేన కార్యకర్త చైతన్య గత నెలలో జరిగిన చిత్తూరు కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ PAC సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, కార్య దర్శి పగడాల రమణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే జనసేన పార్టీ USA NRI‘s తరుపున శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి వారి మిత్ర బృందం తరుపున ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ కమిటీ సభ్యులు మై ఫోర్స్ మహేష్, మండల అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన నాయకులు గాజుల నరేష్, హరి నాయక్, చంద్ర, నందు, శీన, మురళి, బాలాజీ నాయక్, టీవీ.రమణ, జగదీష్, చౌడప్ప, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com