శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ సొట్టవాని పేట TGR నగర కాలనీలో జనసేన పార్టీ తరుపున వీధిలో బ్లీచింగ్ పొడర్ తో ఇంటింటికి శానిటైజేషన్ చేయడం జరిగింది. అలాగే అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటివద్దనే ఉండాలని కోరారు. మాస్కులు ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడాలని కోరారు. అత్యవసరమైతే బయటికి రండి అని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్, సింహాచలం, దుర్గ భాను, త్రినాధ రావు, చిట్టి బాబు, లక్ష్మణ్, గణేష్ ధనుంజయ రావు(బన్నీ) తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com