రైతులకు నీరు మళ్లించిన ఆముదాలవలస జనసైనికులు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ని నారాయణపురం ఆనకట్ట కాలువ లోని నీరు విడిచిపెట్టక పోవడం వలన దిగువ గ్రామలైన రావికంది పేట, కొర్లకోట, కట్యాచార్యులపేట, వెదుర్లవలస, హనుమంతుపురం, తురకపేట, బొబ్బిలిపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వరి పంట ఎండకు ఎండి పాడైపోతున్న కారణంగా ఈ రోజు ఆమదాలవలస జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పేడాడ రామ్మోహన్ రావు గారు రైతులు తో కలిసి నీరు విడిచిపెట్టుటకు తగు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో పేడాడ నర్సింగరావు, జనసేన-బీజేపీ ఉమ్మడి జడ్పీటీసి అభ్యర్థి పేడాడ సురపునాయుడు, బీజేపీ నేత బెండి రవికాంత్, అప్పలనాయుడు, గోవింద రావు, సింహాచలం, రాజారావు, నేతాజీ, అన్నజీ, రామకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com