
ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస చక్కెర కర్మాగారం అంశం 2016 లో నుండి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు రైతులకు అనుకూలంగా, చక్కెర కర్మాగారం అమ్మకం చెల్లరాదని మరియు సహకార రంగంలో నడిపించాలని తీర్పు ఇవ్వగా అలాగే కోర్టులో కొనసాగుతున్న తరుణంలో కర్మాగారంను అమ్మకానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈరోజు ఫ్యాక్టరీ ని సందర్శించిన ఎపిఐఐసి కమిటీని జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు స్థానిక రైతులతో కలిసి ఇక్కడికి రావడానికి గల కారణాలను నిలదీశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు జనసేన కార్యకర్తలు అలాగే స్థానిక బిజెపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.