Search
Close this search box.
Search
Close this search box.

పాపాత్ములు చేతుల మీదగా జరగడం వల్లే అమ్మవారు ఆగ్రహించారు

అమ్మవారు

         విజయవాడ ( జనస్వరం ) : ఘాట్ రోడ్డు వద్ద గల కేసుఖంశాల వద్ద నిన్న కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశాన్ని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ గారు మాట్లాడుతూ దసరా ఉత్సవాల పనులు రెండు రోజులు క్రితం ప్రారంభించారని ప్రారంభించి రెండు రోజులు గడవక ముందే దుర్గగుడి ఘాట్ రోడ్డుకు వెళ్లే మార్గంలో కింద కొండ చర్యలు విరిగిపడ్డాయని అన్నారు. అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు ఉండబట్టే ఎక్కడా కూడా ప్రయాణం నష్టం జరగలేదని నిన్న వర్షం పడబట్టి వ్యాపారస్తులు లేకపోవడం, నిన్న బందు వాతావరణం ఉండబట్టి రాకపోకలు ఎక్కువగా లేకపోవడం ఎవరికి కూడా ఇబ్బందులు కలగకపోవడం కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టేనని, ఆలయ ఈవో గారు గానీ పాలకమండలి చైర్మన్ గానీ ఎందుకు ప్రతిష్టమైన భద్రత చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇంతకుముందు నెలరోజుల క్రితం కూడా ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగి పడితే నెట్ వెయ్యాలి రక్షణ చర్యలు తీసుకోవాలని మేము చెప్పామని అన్నారు. అయినా కూడా ఈఓ గారు గాని పాలక మండలి చైర్మన్కి గాని అభివృద్ధి మీద ఎందుకు దృష్టి లేదని ? ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ మీరు ఎందుకు వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు గాని భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్ని అధిగమించే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో మీరు భక్తులకు సమాధానం చెప్పాలని అన్నారు. ఇంకా నెల రోజులు కూడా లేనటువంటి దసరా ఉత్సవాలకు మీరు పటిష్టమైన రక్షణ చర్య ఏ విధంగా తీసుకుంటారు అని, నిన్న కూడా దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు దేవదాయ కమిషనర్ గారు కొండచర్యలు విరిగిపడిన ప్రదేశం వచ్చి చూసి వెళ్లారు తప్ప వారు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయానికి 70 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. నిన్న భారీ ప్రమాదం గనక సంభవించి ఉంటే కేశఖండనశాల వద్ద గాని అండర్పాస్ వద్ద గాని భారీ సంఖ్యలో ప్రాణ నష్టం కలిగేదని మీరు ముందస్థు జాగ్రత్తలు ఎందుకు తీసుకోరని ఎంతసేపు మీరు కాంట్రాక్ట్ ల మీద డబ్బులు కొట్టేయడం మీద ఏదో రకంగా దోచుకోవడం మీదే వైసిపి నాయకులుకి పాలకమండలికి దృష్టి ఉంటుంది. భద్రతా చర్యల మీద ఎందుకు పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారో మీరు సమాధానం చెప్పాలని అన్నారు. నిన్న అమ్మవారు కనికరించబట్టే ప్రాణనాష్టం జరగలేదని వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దసరా ఉత్సవాలకి ఏదో ఒకటి జరుగుతూ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొండ చర్యలు విరిగిపడ్డాయి అని మరొక ఏడాది అమ్మవారి అంతరాలయంలో కరెంట్ షాక్ కొట్టి ఒక వ్యక్తి చనిపోయారని అన్నారు. ఈ ఏడాది ముందస్తుగానే కొండ చర్యలు విరిగిపడిపోయాయని కొంత మంది పాపాత్ములు చేత దసరా ఉత్సవాల ప్రారంభంలో చయ్యేస్తే ఇలాగే జరుగుతుందని ఏదో పంచ కట్టుకుని పుణ్యాత్ముల్లాగా, పవిత్రుడు లాగా ఫోజులిస్తే పాపాలు చేసినటువంటి వ్యక్తులు యొక్క పాపాలు ఎక్కడికి కూడా పోవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. అదేవిధంగా కనకదుర్గ నగర్ లో పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉందని ట్యాంకులు నిండిపోయాయని నెల నెల 35 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ కి ఏజెన్సీకి చెల్లిస్తున్న సరైన పారిశుధ్య నిర్వహణ లేదని భక్తులు వాపోతున్నారని అన్నారు. దీని మీద ఈఓ గారు దృష్టి సారించాలని మీరు ప్రతిష్టమైన రక్షణ చర్యలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొనకపోతే రాబోయే అనర్ధాలకి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిధార్మిక మండల సభ్యులు తమ్మిన రఘుబాబు, తమ్మిన లీల కరుణాకర్, గన్ను శంకర్, పొట్నూరి శ్రీనివాసరావు, గొట్టా సాయికుమార్ పులిచేరి రమేష్, సాంబ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way