నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం-జనసేన పార్టీ అభ్యర్థి నెల్లిమర్ల మండలంలోని మల్యాడ పంచాయతీ SC కాలనీలో పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి దళిత యువత మహిళలతో మాట్లాడుతూ వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని, దళితులను హక్కున చేర్చుకునే ప్రభుత్వం మరో మూడు నెలల్లో రాబోతుందని దానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి, ఈ దుర్మార్గపు పాలనని ప్రాలద్రోలేలా ప్రతి ఒక్కరు నడుంబిగించాలి అని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే,వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలి అని పిలిపునిచ్చారు. అధికారంలోకొచ్చిన తర్వాత దళితులని విస్మరించే ప్రభుత్వం కాదని, దళితుల హక్కులను పరిరక్షించే ప్రభుత్వమని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com