మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ మరియు జనసేన నాయకులు అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయన్నారు. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయమని అన్నారు. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకురాలు రూప, మదనపల్లి విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, నాయకులు కుప్పాల శంకర, ధరణి, యాసిన్ షేక్, గణేష్, నాని, అబ్దుల్ మాజిద్, కాజా తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com