Logo
Date of Publish : 07 December 2022, 8:28 am
Editor : Sake Naresh

ఏలూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

      ఏలూరు ( జనస్వరం ) : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 66 వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నేడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం మన మదిలో చిరస్థాయిగా ఉంటాయని అన్నారు. ఆయన బాటలోనే పయనిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆ మహానుభావుడు భౌతికంగా లేనప్పటికీ వారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ఈ రోజున భారతదేశంలోని ప్రజలందరూ కూడా వివిధ వర్గాలుగా జీవిస్తున్నారు.. ఆ రాజ్యాంగ ఫలాలే ఈ రోజున ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి అని అన్నారు.. వారు ఇచ్చిన రాజ్యాంగం అమలయ్యే విధంగా ప్రజలందరూ కూడా సమాన హక్కులు కలిగే విధంగా జనసేన పార్టీ నుండి స్ఫూర్తి తీసుకోవాలని అందరూ దానికీ అనుగుణంగా పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జనసేన నాయకులు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కార్యవర్గ సభ్యులు బొండా రాము నాయుడు, కోశాధికారి పైడి లక్ష్మణరావు జనసేన పార్టీ నాయకులు రెడ్డి గౌరీ శంకర్, కందుకూరి ఈశ్వరరావు, నిమ్మల శ్రీనివాసరావు, వల్లూరి రమేష్, వేముల బాలు, అగ్గాల శ్రీనివాసరావు, బొద్దాపు గోవింద్, వీర మహిళలు తుమ్మపాల ఉమా దుర్గ, కోల సుజాత తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com