రాజంపేట ( జనస్వరం ) : టి. సుండుపల్లి లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి పార్టీలు, ప్రజాసంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రపంచ మేధావి డా బి. ఆర్. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రామ శ్రీనివాస్, తెలుగుదేశం వాణిజ్య అధికార ప్రతినిధి ఎం. దామోదర్ నాయుడు, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు యర్రం రెడ్డి, టి. సుండుపల్లి మండల క్లస్టర్ ఇంచార్జ్ శివకుమార్ నాయుడు, మాజీ గ్రామ అధ్యక్షుడు చెన్నంశెట్టి వెంకటరమణ, బలిజ సంఘ నాయకులు జయరామ్, రామాంజనేయులు, రవీంద్ర, బీసీ నాయకులు రమణ, చెన్నకృష్ణ, చంద్రప్పనాయుడు, శ్రీరాములు, దళిత నాయకులు, వీరణాగయ్య, నాగలేష్, ఎం ఆర్ పి యస్ నేతలు, మహాదేవ, నాగేష్, చరణ్, బాలాజీ, పలువురు జనసేనపార్టీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.