Logo
Date of Publish : 14 September 2020, 11:24 am
Editor : Sake Naresh

కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన అంబేద్కర్ యూత్ సభ్యులు…

కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన అంబేద్కర్ యూత్ సభ్యులు...

                  ఆలమూరు మండలంలోని బడుగువానిలంక గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు 30 మంది కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వాడపాలెంలోని బండారు నివాసం వద్ద వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ యువతతోనే మార్పు సాధ్యమని నమ్మే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, మార్పు కోసం జరిగే మహా ప్రయాణంలో మనమంతా భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయం ఇదేనని, ఈ తరుణంలో ఇంత మంది యువకులతో కూడిన బృందం పార్టీలోకి చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి వారితోనే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవుతుందన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించలేదని, పాతికేళ్ల ప్రయాణం అనుకునే రాజకీయాల్లోకి దిగినట్లు చెప్పారు. సమాజంలో మార్పుకోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడాల అమ్మిరాజు, మందపల్లి స్వామి శేఖర్, కప్పల సురేష్, పినమల తాతాజీ, చిక్కాల సుధీర్, నేతల శ్రీనివాస్, బడుగు నరేష్, అజయ్ కుమారు, శ్యాంసుందర్, అంబేద్కర్ యూత్ సభ్యులు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com