రాజంపేట ( జనస్వరం ) : చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై నవ భారత రాజ్యాంగ నిర్మాత డా"భీమ్ రావ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పణ చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత దేశానికి సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, రాజకీయ ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడుకి సమానంగా చెందేలా భారత రాజ్యాంగం రచించారని ఏ ఒక్కరి స్వార్ధ ప్రయోజనాల కోసం కాదని వారు మనవి చేస్తున్నామని తెలిపారు. భారత దేశ రాజ్యాంగ వ్యవస్థలో చాలా మంది జైలుకు వెళ్ళారని అంటూ ఆయా కేసులలో ఆరోపణలు ఋజువయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతి కేసులలో ముందుగా ఐఎయస్, ఐపియస్ అధికారులు జారీ చేసిన జీవోల ప్రకారం అధికారులను విచారించి వారికి జైలు శిక్ష విధించడం రాజ్యాంగం ప్రకారం జరిగిందన్నారు. అదే అవినీతి లో ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధం ఉందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం సంక్షేమ పథకాలను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో నిర్ణయాలను తీసుకుంటుంది కానీ డైరెక్టర్ గా మంత్రులు, ముఖ్యమంత్రులకు, ఎలాంటి లావాదేవీలు ఉండవని తెలిసిన కేవలం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును కండిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ రాజ్యాంగ ప్రాథమిక హక్కులు తెలుసుకునే విదంగా బుద్దిని ప్రసాదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు యర్రంరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్బరాము,గురవయ్య మరియు జనసేనపార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్, జనసేన మాజీ జిల్లా సోషల్ జస్టిస్ మెంబర్ షేక్ సలీమ్, జనసేన శ్రేణులు రగురామరాజు, మున్నా, శ్రీనివాసరాజు, బీసీ నాయకుడు చెన్నకృష్ణ, ప్రజాసంఘాల నాయకులు నాగరాజ, మహాదేవ,నాగేష్,రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com