Logo
Date of Publish : 14 April 2022, 12:24 am
Editor : Sake Naresh

అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’ : పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి

     పిఠాపురం, (జనస్వరం) : భారత రాజ్యాంగ రచయిత భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఒక దార్శినికుడు - భారత దేశంలో వెనుకబడిన వర్గాల్లోని ప్రజలకు కనీస హక్కులు, సామాజిక హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు. సామాజిక స్థితి మరింత బాగుపడాల్సిన అవసరం ఉన్నా, అనాదిగా దళిత ప్రజలపై సాగుతున్న అరాచకాన్ని తెరపైకి తీసుకొచ్చి కనీసం చట్టం దృష్టిలో వారికి సమానత్వాన్ని కల్పించగలిగారు. మేథస్సు వంశపారంపర్యంగానే రానక్కరలేదని చెప్పడానికి అతను ఒక గొప్ప ఉదాహరణ." ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం కాదు. సాటి మనుషుల పట్ల గౌరవ, పూజ్య భావం కలిగి ఉండడమే అసలైన ప్రజాస్వామ్యం" అని చెప్పిన కరుణాహృదయుడు, గొప్ప దార్శినికుడు, మహా మనిషి డా. అంబేడ్కర్. మనది రాజకీయంగా ప్రజాస్వామ్యం అయినా పరిపూర్ణమైన సామాజిక ప్రజాస్వామ్యం కాదు. అంబేద్కర్ కలగన్న సామాజిక ప్రజాస్వామ్యం సాధించడంలో మనం ఇంకా సఫలం కాలేదు. ఆయన ఆశయ సారధి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో సామాజిక ప్రజాస్వామ్యం ఒక జనసేన పార్టీతోనే సాధ్యం. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం,కుల,మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మన ఆశల దేశానికి రూపుకల్పించిన మహనీయుడు శ్రీ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్భంగా నవభారత నిర్మాతగా, గొప్ప దేశభక్తునిగా,సామాజిక విప్లవకర్తగా చేసిన కృషిని స్మరించుకుందామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com