Search
Close this search box.
Search
Close this search box.

వెదురుకుప్పం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

 ● అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించిన వాళ్ళు సాత్వికతను పొందుతారు

● ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలనే కోరిక కలుగుతుంది

● జిడి నెల్లూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్

     వెదురుకుప్పం, (జనస్వరం) : బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ వెదురుకుప్పం మండలంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించిన వాళ్ళు ఒక సాత్వికతను పొందుతారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలనే కోరిక కలుగుతుందని తెలిపారు. అంబేద్కర్ అట్టడుగు స్థాయి నుండి ఆకాశానికి ఎదిగిన నాయకుడని, చాలా కష్టపడి పైకి వచ్చాడని, తల్లిదండ్రులు ఒక అపురూపమైన శిల్పాన్ని ఈ ప్రపంచానికి అందించారని ఉద్బోధించారు. నీవు ఇచ్చే వాడివిగా ఉండాలి, కానీ తీసుకునే వాడిగా ఉంటే, ఇచ్చే వాడు నీ మీద ఆధిపత్యం వహిస్తాడని, విద్య ఎంత ఇచ్చినా తరగదని, నీవు విద్యావంతుడు అయితే నీవు ఇచ్చేవాడు గానే ఉంటావని తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నల్ల బోర్డు దగ్గరకు వెళితేనే ఉలిక్కి పడిన ఈ సమాజం ఆయన చేత రాజ్యాంగం రాయించుకోవలసి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ ఎన్ని అవమానాలు పొందారో ఆ తర్వాత అన్ని గౌరవాలు పొందారని ఉద్ఘాటించారు. మనిషిని ప్రేమించడం, మనిషిని సముత్తేజపరచటం అంబేద్కర్ దినచర్యలో భాగం అయిందని తెలిపారు. ఆయన కులం పునాదుల పెకలించాడని, లోయల్లో నుండి పైకి ఎదిగిన ప్రతిభావంతుడని కీర్తించారు. ప్రపంచంలో అట్టడుగు నుండి పైకి ఎదిగిన వారే సమాజాన్ని సరిగా అర్థం చేసుకున్నారని, అంబేద్కర్ మస్తకంతో రాజ్యాన్ని, పుస్తకంతో ప్రపంచాన్ని జయించాడని అభివర్ణించారు. కత్తి కంటే కలం గొప్పదని నిరూపించిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అభివర్ణించారు. మనిషిని ప్రేమించి మనిషి ప్రతిభను గుర్తించలేని ఈ దేశంలో, ఆయన ఎన్నో అవమానాలు అనుభవించి, ఈ అవమానాలు నా వారసులు అనుభవించ కూడదని నిర్ధారించుకుని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలియజేసారు. ధీరులు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం చేయరని, వారు లభ్యం కాని దాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తారని, దాన్ని సాధించే ధీరోదాత్తను కలిగి ఉంటారని తెలిపారు. సంపద కంటే జ్ఞానం గొప్పదని, జ్ఞానం ప్రపంచాన్ని నడిపిస్తుందని ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక మనిషి ఒక విలువ అదే ఒక ఓటు అని, ఓటుకున్న ప్రాముఖ్యతను తెలిపారు. ప్రతి వ్యక్తిని గుర్తించడం, ఆ మనిషిలో ఉన్న ప్రతిభను గుర్తించడం, ఆ ప్రతిభ మానవ సమాజానికి ఎలా ఉపకరిస్తుందని గుర్తించడం వంటి లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అభివర్ణించారు. అంబేద్కర్ లో ఉన్న గొప్పతనం నిశితమైన దృష్టి, లోతైన పరిశీలన, విస్తృతమైన భావజాలం అని తెలిపారు. ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి, ఆత్మీయం చేసుకోవాలి, అదే మానవత్వమని అంబేద్కర్ లో ఉన్న ప్రతిభను గుర్తు చేశారు. కులం లేని మనిషి ఎంత ఎత్తు కైనా ఎదుగుతాడు, కులం లేని మనిషి ప్రపంచాన్ని ఇస్తాడని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యోగి, జనార్ధన్, శోభన్ బాబు, బుజ్జి, దేవేంద్ర, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way