ప్రకాశం ( జనస్వరం ) : భారత రత్న గ్రహీత, ప్రపంచ విజ్ఞాన ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డా||బి.ఆర్.అంబేడ్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా లింగసముద్రం మండల కేంద్రంలోని కోటయ్య మందిర సమీపంలో డా||అంబేడ్కర్ గారి చిత్రపటానికి పూల దండతో సత్కరించి పాలాభిషేకం తో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లింగసముద్రం మండలంలోని జంపాలవారిపాలెం, వెంగళాపురం, గంగపాలెం, అన్నెబొయినపల్లి అను గ్రామాలలో జనసేనపార్టీ తరుపున జిల్లా పార్టీ నిర్వహణ కమిటీ సభ్యులు కొనిదెల శ్రీనివాసులు, నాయకులు మార్తాటి బ్రహ్మయ్య, ఉమ్మడి కొండయ్య, మార్తాటి గణేష్, అజయ్ అరవింద్, జనసైనికులు మరియు అంబేడ్కరిస్ట్ ముద్దు బాలకోటయ్య పాల్గొని అంబేడ్కర్ ఆశయ సాధనలో దళిత, బహుజన మేధావులు ఏకం అవ్వాల్సిన సందర్భాన్ని వివరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com