దెందులూరు ( జనస్వరం ) : దెందులూరు నియోజకవర్గ కేంద్రమైన దెందులూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దెందులూరు సెంటర్లో నియోజకవర్గ జనసైనికుల సమక్షంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పాదాలకు నమస్కారం చేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సమాన హక్కుల కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దళితులకు అణగారిన వర్గాల వారికే కాకుండా అన్ని కులాల మతాల వారికి రాజ్యాంగంలో హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుందని ఆయన అన్నారు. సమాజంలో ఒక్కోక్కరూ మరో అంబేద్కర్ లా మారాలని జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారిఆశయాలను 10 శాతం మాత్రమే అమలు చేయడం జరుగుతుందని మిగిలిన 90 శాతం కూడా అమలు చేస్తే ప్రతి ఒక్కరు సమానత్వంతో కొనసాగుతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు, దెందులూరు మండల కాపుసంక్షేమ సేన అధ్యక్షులు పూజారి వెంకటరత్నం నాయుడు, సేవ్ మిషన్ డైరెక్టర్ మేదిడ నికోలా,గెద్దల నరేంద్ర, గుబ్బల లక్ష్మణరావు, ఏనుగు రామకృష్ణ, నల్లమిల్లి రమేష్, పూజారి సీతారాం, కలపాల ప్రేమ్ కుమార్,సుంకర ప్రసాద్, దమ్ము సాయి, ఇప్పిలి రవి, వేగివాడ రామకృష్ణ, నిమ్మన రవికుమార్, రామకృష్ణ, తంబీ తదితరులు పాల్గొన్నారు.