Logo
Date of Publish : 23 June 2021, 3:24 pm
Editor : Sake Naresh

అంబటి రాంబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్న జనసేన నాయకులు కొమ్మిశెట్టి వెంకట సాంబ శివరావు

         సత్తెనపల్లి మున్సిపాలిటీ స్థానిక శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, అర్ధరహితమైనవని నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రముఖ న్యాయవాది కొమ్మిశెట్టి వెంకట సాంబ శివరావుగారు అన్నారు. ఆయన మాట్లాడుతూ అంబటి ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్తెనపల్లిని అభివృద్ధి చేయటానికి  అది “ఒక పల్లెటూరు కాదు.. ఒక పట్టణం కాదు”అని వ్యాఖ్యలు చేయటమే కాకుండా అవమానకరంగా మాట్లాడటం చూస్తుంటే అవగాహన లేమిగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ పట్టణాన్ని  పల్లెటూరుతో పోల్చిన అంబటిని ఈ నియోజకవర్గ ప్రజలు ఎలా ఎన్నుకున్నారో వారికే తెలియాలని ఆయనన్నారు. సత్తెనపల్లి గ్రామ పంచాయతీగా వున్నప్పుడే శాత వాహన నూలు మిల్లుపరిశ్రమలు బస్ స్టేషన్ తదితర సంస్థలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అనాటి శాసనసభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ చేయించారని, అనంతరం ఎన్నోఅభివృది కార్యక్రమాలు జరిగి నేడు జిల్లాలోనే ఒక ప్రత్యేకతను చాటుకున్న ఈ పట్టణంపై ఎమ్మెల్యే అంబటి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోడెల హయాంలో జరిగిన అభివృద్దిని చూసైనా రాంబాబు కసితో పనులు చేయాల్సిందిపోయి ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వహయాంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రానికి వన్నె తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది శిక్షణా కేంద్రం, కేంద్రీయ విద్యాలయం, మోడల్‌ పోలీస్‌స్టేషన్, వావిలాల పార్క్‌, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తారకరామసాగర్‌ నిర్మాణం, స్టేడియం, గెస్ట్‌హౌస్‌లు, రోడ్లవిస్తరణ, రైల్వేస్టేషన్‌ రోడ్డు ,ప్రభుత్వ భవనాలు, ఇలా అనేక పనులు జరిగి నేడు అభివృద్ది చెందిన పట్టణాల్లో ఒకటిగా విరజిల్లుతున్న సత్తెనపల్లి పట్టణంపై అంబటి అనుచిత  వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com