
కడప ( జనస్వరం ) : చిట్వేలు జనసేన నాయకుడు మాదాసు నరసింహా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకూ ముద్రగడ పద్మనాభం గారితో కలిసి కాపు జాతిని జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టింది మీరు! ఎక్కడ అప్పటి ఉద్యమం? ఎక్కడికి పోయింది ఆ పోరాటం? అధికారం రాగానే కాపు ఉద్యమాన్ని అటకెక్కించిందే కాకుండా, కాపులకి ఇస్తానన్న ఏటా 2వేల కోట్ల రూపాయిలు ఇవ్వకుండా, కాపు కార్పోరేషన్ ని ఉత్సవ విగ్రహంగా మారుస్తుంటే మీరేం చేస్తున్నారని అన్నారు. మీ మంత్రి పదవుల కోసం సాటి కాపు వర్గీయుడైన పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడాన్ని కాపు సమాజం మొత్తం గమనిస్తూనే ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన విషయం మీకు తెలియదేమో, ప్రజలకి తెలుసు.. అప్పటి తెలుగుదేశం అవినీతి, అక్రమాలపై విభేదించి బయటికి వచ్చిన విషయం మీకు తెలియదా? కాపుల్ని తాగుబోతులు, తిరుగుబోతులు అన్న మీకు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదో లేదో ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకోండి తప్పులేదు, దాని కోసం జగన్ రెడ్డి ఎలా చెప్తే అలా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే సహించే ప్రసక్తే లేదు. రెండేళ్ళ తర్వాత మీరు ఎక్కడుంటారో మీకే తెలియదని ఎద్దేవా చేశారు.