ఒంగోలు, (జనస్వరం) : ప్రభుత్వం వికలాంగులకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికీ రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి, MRPS ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద వికలాంగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున మద్దత్తు తెలుపుతూ ఒంగోలు నుండి బయలుదేరుతున్న వికలాంగులకి తన సొంత నిధులతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ భర్త చిరంజీవి, రెండో డివిజన్ జనసేన sc యూత్, MRPS నాయకులు ఆనంద్ మాదిగ, వికలాంగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.