గల్ఫ్ ఎన్ఆర్ఐ జనసేన, రాజకీయాలకు అతీతంగా సామన్యుల క్షేమం కోరి, పదవులుకన్నా పేదవాడి సంక్షేమం మిన్న అన్న నినాదంతో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం దిగుమర్తి సరస్వతి ప్రసాద్ రావుకు అందజేసారు. ఆమె కడుపులో కంతులు ఏర్పడి చాలా భాదపడుతూ ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ఎన్నారై నాయకులకు అందించిన సమాచారం ప్రకారం, కష్టాలను నష్టాలను తెలుసుకున్నారు. ఎక్కడో దేశం కాని దేశం లో ఉంటున్న గల్ఫ్ జనసైనికులు, ఎంతో మానవతా విలువలు పాటిస్తూ, పి గన్నవరం మండలం, ముంజవరపుకోట్టు గ్రామం అడ్డపుంతలో నివసిస్తున్న మహిళ కొరకు సాయం అందించడం కోసం గల్ఫ్ దేశాలు ఐన ఆరు దేశాలకు చెందిన గల్ఫ్ జనసేన వేదిక (బహ్రయిన్, కువైట్, ఓమెన్, సౌదీ అరేబియా ఖతార్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కు చెందిన తెలుగు ఎన్ఆర్ఐ ఉద్యోగ మిత్రులు అంతా కలిసి ఒక ప్రవాహమై, వివిధ రూపాల్లో అనేకమందికి గత కొంత కాలంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా ఆ కుటుంబం ఎంతో ఆనందిస్తూ, గల్ఫ్ జనసేన సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆ కుటుంబం తెలపడం, ఈ కార్యక్రమానికి మండల జనసేన నాయకులు చేతుల మీద ఆ కుటుంబానికి వారిచ్చిన సాయం అందించడం జరిగిందన్నారు. మా అదృష్టంగా భావిస్తున్నామని జనసేన నాయకులు మాట్లాడుతూ, అనేక మంచి కార్యక్రమాలు, కుల మత భేదం లేకుండా, నిరుపేద కష్టాల్లో మేము కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా ఉన్నామంటూ , జనసేనాని ఆశయాలతో ముందుకు వెళ్తున్న గల్ఫ్ జనసేన, గల్ఫ్ జనసేన నాయకులకు , ఎన్ఆర్ఐ మిత్రులకు నా అభినందనలు అని జనసేన నాయకులు తెలిపారు. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి కొరకు లాక్ డౌన్ లో, గోదావరి వరద ఉధృతి లోనూ, ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆదుకుంటూ, పలుసేవా కార్యక్రమాలు దేశవిదేశాల్లో కష్టాల్లో ఉన్న తెలుగు వారి పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్న గల్ఫ్ జనసేనను అభినందించారు. ఎంత సంపాదించాం కాదు, ఎంత మంది హృదయాల్లో ఉన్నాము అనేది ముఖ్యమని మాట్లాడుతూ, జనసేన నాయకులు , పలువురు జనసైనికులకు , కార్యకర్తలు కు దిగుమర్తి కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పి.గన్నవరం మండలం జనసేన నాయకులైన కుంపట్ల నరసింహారావు సూర్య మోహన్ రావు విజయ్ గోపాల్, భూసయ్యకాపు, శ్రీను, ఆకుల వెంకటరంగారావు, బిక్కిన సూర్యనారాయణమూర్తి, స్వామి నాయుడు వాసంశెట్టి కుమార్ శ్రీనివాసరావు, వెంకటేష్ శృంగవరపు లక్ష్మణ రావు పేరాబత్తుల సూర్య ముకుంద్, దైవాల రాంబాబు పాటి సత్తిబాబు, గుత్తుల రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com