Search
Close this search box.
Search
Close this search box.

మంత్రిగా అమర్నాథ్ అనర్హుడు – గవర్నర్ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోవెలకుంట్ల జనసేన నాయకులు డిమాండ్

    కోవెలకుంట్ల, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ మంత్రిగా అనర్హుడని జనసేన నాయకులు గురప్ప, బోధనం ఓబులేసు, చిన్న కిట్టు విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ వెంటనే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కౌలు రైతుల భరోసా యాత్రను తీవ్రంగా విమర్శించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగడం అధికార అహంకారానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రమంత్రిగా భాద్యతయుతమైన వివరణ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం పైన పదే పదే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, దత్త పుత్రుడని వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళాం ఎవరు ? అమర్నాథ్ నాల్గో పెళ్ళాం అని మేము కూడా విమర్శలు చేస్తాము. కానీ మేము మీలాగా కుసంస్కారం కలిగిన వ్యక్తులకు కాదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శిస్తున్నమని పేర్కొన్నారు. CBI దత్త పుత్రుడు ఎవరో చంచల్ గూడ జైల్ షటిల్ టీం ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ వివాహాల వలన రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి అప్పుల్లో ముందంజలో ఉంది. పవన్ కళ్యాణ్ వివాహాల వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల మోతలు, ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల, రాజధాని లేని రాష్ట్రం, పోలవరం నిర్మాణంలో నిర్లక్ష్యం, ఇసుక కొరత, రహదారుల గుంతలమయం, వైసీపీలో అసమ్మతి, తిరుగుబాటు. దీనికి అంతటికి కారణం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు. ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయన మంత్రి పదవికి అనర్హుడని రాష్ట్ర గవర్నర్ వెంటనే అతన్ని మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు పవణ్ కల్యాణ్ పైన ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే జనసేన పార్టీ చూస్తో ఊరుకోదని తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way