అమలాపురం ( జనస్వరం ) : కోనసీమ అల్లర్లు వెనక జనసేన పార్టీ ఒక ప్రముఖ నాయకుడి పాత్ర వుందని, జనసేన పార్టీ హస్తముందని, కోనసీమ యువతని జనసేన పార్టీ ఉసుగొల్పిందని, జడ శ్రావణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవం, శ్రావణ్ కుమార్ నీదగ్గర ఆధారాలు వున్నాయా దమ్ము ధైర్యం ఉంటే ఆ ఆధారాలు బయట పెట్టాలని లేని పక్షంలో జనసేన పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని అమలాపురం జనసేన ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ పేరు వాడుకుని పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేస్తున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపణల వెనుక జగన్ ప్రభుత్వానికి మేలు చేసే ఆలోచన గాని వేరే పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే దురుద్దేశం వుందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆలోచన విధానం పైన దళితుల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగాన్ని అరికట్టాలని మొట్టమొదట సదస్సు నిర్వహించిన పార్టీ జనసేన పార్టీ. మొట్టమొదటగా స్పందించిన రాజకీయపార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్. కోనసీమకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలని మొట్టమొదట తీర్మానం చేసిన రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఇవన్నీ శ్రావణ్ కుమార్ తెలుసుకుని మాట్లాడాలి, పైగా శ్రావణ్ కుమార్ జనసేన పార్టీ జెండాను దళితవాడల్లో పాతరేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు జనసేన పార్టీ జోలికొస్తే జనసేన జెండా జోలికి వస్తే చూస్తూ కూర్చోవడానికి గాజులు తొడిగించికుని లేము అని రాజబాబు మండి పడ్డారు. జనసేన పార్టీలో ఉన్న దళిత ప్రతినిధులుగా నీకు చాలెంజ్ చేస్తున్నామని అన్నారు.
*నీకు దమ్ముంటే రా దళిత వాడల్లోకి వెళదాం దళితవాడలలో ఎవరిని ఆహ్వానిస్తారో తేల్చుకుందాం
మేజిస్ట్రేట్ ఉద్యోగంలో ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన తర్వాత మీడియాలో మాత్రమే దళిత హక్కుల కోసం మాట్లాడుతున్నావు తప్పా ఏనాడు ప్రజాక్షేత్రంలో దళిత హక్కుల కోసం పోరాడలేదు, కేవలం మీడియా పులిగా మాత్రమే నీవు మిగిలావు అంటూ శ్రవణ్ పై రాజబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పొందుతున్న జనసేన పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక ముమ్మాటికీ జగన్ ప్రయోజనం దాగివుంది, శ్రావణ్ కుమార్ ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలి, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహదశ నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, పార్టీ సీనియర్ నాయకులు మోకా బాలయోగి, ముత్తాబత్తుల శ్రీను, ఆకుల బుజ్జి, తాళ్ల రవి, తూము రమేష్,ఆర్లపల్లి దుర్గ పాల్గొన్నారు.