
ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో జనసైనికుడు కరణం కిరణ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, స్దానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ కొల్ల జయరామ్, తులగాపు మౌళి, కిల్లన నరేష్, టంకాల శ్రీనివాస్ కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి 35000 వేల రూపాయలు జనసేనపార్టీ తరుపున అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఏ కష్టం వచ్చినా జనసేనపార్టీ, జనసైనికులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.