● ఆలూరు నియోజకవర్గ విద్యార్థినులకు అండగా ఉంటాం అంటున్న జనసేన పార్టీ నాయకులు
● అతివల చదువు – అవనికి వెలుగు
● ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా మధ్యలోనే చదువులు ఆగిపోతున్నాయి
● కనీస రహదారులు – బస్సు సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు?
● నిగ్గదీసి అడుగు ఈ వైయస్సార్ సిపి – తెలుగుదేశం పార్టీ నాయకులను
ఆలూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నెకల్ వెంకప్ప గారి సూచనలు మేరకు దేవనకొండ మండల జనసేన నాయకులు ‘అతివల చదువు – అవనికి వెలుగు’ అనే నినాదామతో ఆడబిడ్డల చదువులకు అండగా ఉంటామంటూ, స్థానిక కస్తూర్బ బాలికల పాఠశాలలో ఆడబిడ చదువు యొక్క విశిష్టతను తెలిజెస్తూ, అలాగే వాళ్ళ చదువులకు అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. అనంతరం MEO గారికి కూడా ఆడబిడ్డల రక్షణకు మీరు కూడా సహకరించాలని వారి తల్లిదండ్రులులోని భయందోళనలు పోగొట్టాలని వినవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మాయిలు చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి (బస్సులు లేకపోవడం వలన, వలసల వలన, ఆర్థిక స్థోమత లేకపోవడం వలన, తల్లిదండ్రుల్లో ఇంకో కొన్ని భయాలు వలన). చదువు జీవనోపాధితో పాటు జీవన శైలిని కూడా మార్చే విధంగా భవిష్యత్తు ఉండాలి. ప్రస్తుత ప్రపంచంలో మహిళలు పోటీ పడి సొంత కాళ్లతో, వాళ్ల తెలివితో ఎవరిపైన ఆధారం లేకుండా జీవనశైలిని కొనసాగిస్తున్నారు. కానీ మన నియోజకవర్గంలో వంటింటికే పరిమితం అవుతున్నారని అన్నారు. మీకు అండగా మేముంటాం అంటూ ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విద్యార్థినులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం జనసేన నాయకులు బడేసాబ్, అంథోని, నందు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.