2018 పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆలూరు జనసైనికుల ధర్నా
కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ దేవనకొండ మండలం తీవ్ర కరువు నేపథ్యంలో 2018 సంవత్సరంలో దేవనకొండ మండలంను కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. రెండు సంవత్సరాలు దాటిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ రైతుల పట్ల నిర్లక్ష్యం పై జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇతర పార్టీలతో కలసి ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, సిపిఐ – సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్, లోక్ సత్తా పార్టీల మండల నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొని ధర్నా చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ తరఫున మండల నాయకులు నరేంద్ర, ఎంపిటిసి అభ్యర్థి మక్బుల్, ఖలీల్, అరవింద్, జాకీర్, అరవింద్, అల్లాబకాష్, అఖిలపక్ష పార్టీ నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.