Logo
Date of Publish : 15 November 2022, 3:30 pm
Editor : Sake Naresh

వర్షానికి తోడు మురుగుతో జనజీవనం అస్తవ్యస్తం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 183వ రోజున 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చ్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో మురికి కాల్వలు, సైడు కాల్వల్లో మురుగు తీయకుండా తాత్సారం చేయడంతో చిన్నపాటి వర్షాలకు కూడా మురుగు చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని, మురుగు దుర్గంధం వెదజల్లుతోందని అన్నారు. అనేకమంది విషజ్వరాలతో అల్లాడుతున్నారని, ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com