విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ, (జనస్వరం) : స్థానిక 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, బెజవాడ బెబ్బులి వంగవీటి రంగా జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి హింస పాలనకు అంతమొందించేందుకు కృషి చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని, బెజవాడ రాజకీయం గురించి మాట్లాడాలంటే రంగా పేరు తప్పకుండా ప్రస్తావించాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అయన చేసిన కృషి వెలకట్టలేనిదని తెలిపారు. అల్లూరి సీతరామరాజు, వంగవీటి రంగా తక్కువ కాలం జీవించిన చరిత్రలో నిలిపోయారని కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ.. వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నారంశెట్టి కూర్మారావు, మద్దాల సంగీత, బసవ నరేష్, పడాల ప్రసాద్, మదాసు అప్పారావు, చంటి, బసవ ప్రసాద్, వెంకట్రావు, ప్రసాద్, వీర మహిళ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com