Logo
Date of Publish : 25 August 2023, 9:46 pm
Editor : Sake Naresh

బ్రహ్మానందం నివాసంలో అల్లు అర్జున్‌ సందడి.. కారణం ఏమిటంటే?

     ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో నటుడు అల్లు అర్జున్‌  సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్‌ - ఐశ్వర్య దంపతులకు అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. ఇదిలా ఉండగా, ఉత్తమ నటుడిగా బన్ని జాతీయ అవార్డు సొంతం చేసుకోవడంపై బ్రహ్మానందం ఆనందపడ్డారు. పుష్పగుచ్ఛం అందచేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు అల్లు అర్జున్‌కు అవార్డు రావడంపై నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, మయాంక్‌ హర్షం వ్యక్తం చేశారు. బన్నిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

         బ్రహ్మానందంతో అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి వేంకటేశ్వర స్వామి ఫొటోను స్వయంగా స్కెచ్‌ చేసి అల్లు అర్జున్‌కు బహుమతిగా అందించారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల బన్ని పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com