Logo
Date of Publish : 16 April 2022, 4:08 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ కార్యాలయాలకు ఆసుపత్రి భవనాలను కేటాయిస్తే ఉద్యమం తప్పదు : కిరణ్ రాయల్

     తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి మెటర్నటీ హాస్పిటల్‌ లో ఇప్పటికే గదులు చాలక పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బంది పడుతుంటే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి భవనాలు కేటాయించాలనుకోవడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పత్రికాముఖంగా తెలిపారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు కలవరపెడుతున్నాయి. అయితే తాజాగా హాస్పిటల్‌ కు చెందిన భవనాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలకు కేటాయించాలని ప్రయత్నించడాన్ని జనసేన తప్పుబడుతోందని అన్నారు. భవనాలు ఖాళీగా ఉంటే ఆ భవనాల్లో పేషెంట్ల సహాయకులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. చెట్ల కింద ఎండలో పేషెంట్ల సహాయకులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిని ఆస్పత్రి అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. నూతనంగా ఏర్పాటు చేసిన పద్మావతీ నిలయంలో ని కలెక్టరేట్‌ లో గదులు ఖాళీగా ఉన్నా... పేదల కోసం నిర్మించిన హాస్పిటల్‌ లో కార్యాలయం కేటాయించాలనుకోవడం దారుణమని అన్నారు. ఆస్పత్రి భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తే జనసేన ప్రత్యక్ష పోరాటానికి దిగి... పేద రోగుల పక్షాన నిలుస్తుందని తెలియజేస్తుందని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com