Logo
Date of Publish : 14 August 2020, 7:44 am
Editor : Sake Naresh

హిందూ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : జనసేన కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్

హిందూ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : జనసేన కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్

            జనసేన పార్టీ  కదిరి టౌన్ నందు ఇంతవరకు హిందువులకు స్మశాన వాటికకు స్థలం లేనందున ఎవరైనా హిందూ కుటుంబంలో చనిపోయిన యెడల వారిని రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రోడ్డు వెడల్పు జరిగినప్పుడు వాటిని తీసివేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గతంలో 2018 సంవత్సరంలో 2019 సంవత్సరంలో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.  కానీ, ఇంతవరకు దానిమీద ఎటువంటి చర్య తీసుకోలేదు .అందువల్ల మళ్లీ ఈ రోజు కదిరి తహసీల్దార్ గారికి హిందూ స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీ ముకుందా గారికి జనసేన పార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినారు.  భైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలాన్ని  కేటాయించకపోతే తప్పకుండా లాక్ డౌన్ అయిపోయిన వెంటనే రోడ్డు పైకి వచ్చి నిరసన తెలియజేస్తామని తెలియజేశారు. గతంలో పలుమార్లు అధికారులకు ఈ విషయమై విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని హిందూ శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించకపోతే జనసేన పార్టీ తరుపున మరింత పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ జనసేన అధ్యక్షులు చలపతి , అడ్వకేట్ రవీంద్ర, అంజిబాబు, లక్ష్మణ్ కుటాల, ఈటి లోకేష్, వంశి, హరీష్, మహేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com