ప్రజాసంక్షేమం ప్రథమ కర్తవ్యంగా రాజకీయాలను నడుపుతున్న జనసేనకు ప్రజలతోనే పొత్తు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే అడుగులు. జరుగుతున్న అసమర్ధ పాలనకు, వారి వికృత చేష్టలను అంతమొందించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన చూపించే స్నేహహస్తం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవడం ముఖ్యం. రాష్ట్ర యోగక్షేమాలను పరిగణలోనికి తీసుకుని నడిచే వ్యూహాలను అవగతం చేసుకోవడం ప్రధానం. నేటి సమకాలీన రాజకీయాలలో అత్యంత వేగంగా ప్రజాదారణ పొందుతున్న జనసేన పార్టీ కర్తవ్యాన్ని విశ్లేషించుకుంటూ తక్కిన పార్టీల ఉనికికై జరిగే పోరు గురుంచి ఒకసారి సింహావలోకనం చేద్దాం.
రాజకీయపార్టీ యొక్క సానుభూతి పరుడిగాకాక ఒక సామాన్య పౌరుడిగా, సమాజాన్ని పరికించి చూసిన ఒక సగటు మనిషిగా విశ్లేషించవలసివస్తే జనసేన పార్టీ యొక్క కార్యదక్షత, సేవాభావం, పూర్తిగా రాష్ట్ర భవిష్యత్తుపై తీసుకునే శ్రద్ధను ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారన్న విషయం గత కొద్దికాలంగా తేటతెల్లమవుతుంది. జనసేన పార్టీ యొక్క ఈ బాధ్యతనే గతంలోనూ టి.డి.పి పార్టీ వారి మనగడకు కారణమయ్యింది. ఎటువంటి ఆపేక్షలకూ లోనుకాక 2014లో వారికి జనసేన అండగా నిలచి చంద్రబాబు గారిని నిజంగానే అడ్మినిస్ట్రేటరుగా అనుకుని విభజనతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని గాడిన పెడతారనుకుని ఆశించి మద్దతునిచ్చింది. అప్పట్లో మేధావి వర్గం ఈ మద్దతును సమర్ధించింది., కానీ యిక్కడే రాబోయే రోజుల్లో జనసేనకు ఎదురయ్యే పర్యావసానాలను అంచనా వెయ్యలేకపోయింది. అందుకు కారణం రాష్ట్ర క్షేమం కోసం చేసిన త్యాగం అనడంలో అతిశయోక్తి లేదు.
2014లో ఓటమి నుండి బయట పడేసిన జనసేన పార్టీని కాదని టి.డి.పి వారి కార్యక్రమాలు, వారు చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా వాటిని పరిగణలోనికి తీసుకోకుండా గతంలో వారికిచ్చిన మద్దతునే అస్త్రంగా చేసుకుని ఇప్పటి అధికారపార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు వారి తప్పులను కప్పిపుచ్చుకుంటూ గత మద్దతును సాకుగా చేసుకుని ప్రజలలో ఒక అస్పష్టమైన పరిస్థితులను సృష్టించి నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడే ప్రజలు గమనించాల్సిన విషయాలు ఒక్కొక్కటిగా చూస్తే.. అసలు మద్దతు ఇవ్వడం వల్ల జనసేనకు ఒరిగింది శూన్యం, టి.డి.పి వంటి అవకాశవాద పార్టీతో మిత్రపక్షంగా ఉండడం వల్ల చేసిన ప్రజాపోరాటాలను ప్రజలలోనికి బలంగా తీసుకువెళ్ళి చెప్పుకోలేకపోవడం, ప్రజాక్షేమం ధ్యేయంగా ఉద్భవించిన పార్టీ యొక్క ఉనికిని కొన్ని సంవత్సరాల కాలానికి ధారాదత్తం చెయ్యడం. మద్దతు పొందిన వారి పార్టీ క్యాబినేట్ స్థాయి, కార్యకర్తల నుండి అపవాదులను, అగౌరవాన్ని కూడగట్టుకుంది. ఇప్పటికీ భరిస్తూనే వుంది. ఆ పరిస్థితులే మరొక ప్రణాళికలే లేని వైయస్సార్ పార్టీ విజయం దక్కించుకోవడానికి మార్గం సుగమమయ్యింది. తప్పుడు ప్రణాళికలతో రాష్ట్రాన్ని పాలించి 5 సం. వ్యవధిలో వారి స్థాయిని తగ్గించుకుని ఇప్పటికీ అధికార వ్యామోహంతో అందలమెక్కాలని చూస్తున్న టి.డి.పి వారి వైఖరి ఏమిటి..?? అడ్డగోలుగా సామాన్యుడి నడ్డివిరుస్తూ పక్కవారిని అమ్ముడుపోయారంటూ, ప్రతిపక్షాలంతా ఒకటేనంటూ వారి ఉనికి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారపార్టీ వారి ఎత్తుగడలేమిటి..?? విశ్లేషిద్దాం స్నేహితులారా రండి..!
రాజకీయలు పూర్తిగా 'డబ్బు, మద్యం పంపినీ, పథకాలు, వ్యామోహాలు, కులసమీకరణాలు, సెంటిమెంట్..' ఇలానే సాగిపోతున్నాయి. ఈ పరిస్థితులే రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసాయని గ్రహించకపోతే జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఓటరు అంతరంగాన్ని ఒక్కసారి మదిద్దాం రండి..!!
త్రిముఖ పోటీని ముందుగా మనం విశ్లేషిద్దాం....
పూర్తిగా అప్రణాళికాయుత చర్యలతో వైయస్సార్ పార్టీ ప్రజాధరణని కోల్పోతూ వస్తుంది. ప్రధాన ప్రతిపక్షం గతంలో చేసిన తప్పులకు, వారి వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని బలమైన పోరాటాలు జరుపవలసిన చోట, నిలబడి తేల్చుకొవాల్సిన చోట ముఖం చాటేసే విధానాలను అవలంభించింది. ఓటమిని సైతం లెక్క చెయ్యక 8 సం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడి జనంలో స్థానాన్ని పెంచుకుంటూ వస్తుంది జనసేన పార్టీ మాత్రమే. అర్ధికంగా బలమైన పార్టీలుగా ఉన్న అధికార, ప్రతిపక్షపార్టీలకు ఈ పరిస్థితులే మింగుడుపడడం లేదు, అయితే వారికి గల ఆర్ధిక వనరులతో జనసేనకుకు హాని చేసే విషయంలో తప్పుడు ప్రచారాలతో సాగిపోతూ వారి ఉనికిని కాపాడుకుంటున్నారు. పథకాలను ఎరగా వేసి, రాష్ట్ర ఖజానాను ధ్వంసం చేసి రేపటి పరిస్థితులని పూర్తిగా విస్మరించి ప్రకృతిని కొల్లగొడుతూ స్వైరవిహారం చేస్తున్న పార్టీపై గెలుపుని సాధించడం బలమైన ప్రజామార్పూ వస్తేనేగాని సాధ్యం కాదు. అయితే ఈలోగా రాష్ట్రం యొక్క పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉంది. సామాన్యుడి జీవితం దుర్భరం అయ్యే పరిస్థితి ఉంది. అందుకే వాటిని ఎదుర్కొనేందుకు ఒక సామాజిక అంశంగా దృష్టిలో పెట్టుకొని పొత్తువైఖరికి సాగే ఆలోచనను కాదనలేని అంశం.
చంద్రబాబు గారి ఆర్ధిక సంస్కరణలు వారి అనుయాయులకు, బాకా ఊదే వారికేనని అందరికీ తెలుసు. అలా చేసే రాష్ట్ర విభజనకు చాలా వరకూ తను కారణమయ్యారు. రెండుకళ్ళు అని చెప్పి తప్పించుకున్నారు. అంతా నేనే అభివృద్ధి చేసానని చెప్పుకొచ్చే ఆయన రాష్ట్రం నలుమూలల అభివృద్ధి ఉండాలని గ్రహించలేకపోవడం ఆయన చెప్పుకొచ్చే విజనరీ అనే ఒక మాయా దండంలోని లోపం. ఆయన తరువాత ఆయన కుమారుడికి పార్టీని అప్పజెప్పి రాజకీయంగా వారి ఉనికిని కాపాడుకోవడంలో చేసే ప్రణాళికలే గానీ రాష్ట్రం క్షేమం పట్టని వైఖరి తనది. ప్రజా సంక్షేమమే ప్రధానమనుకుంటే తన కుమారిడి రాజకీయ భవిష్యత్తుకన్నా.. రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని తను అనుకునేవారు. లోకేష్ గారి సమర్ధతను బహిరంగంగానే విమర్శించే పరిస్థితుల్లో వాతవరణం కనిపిస్తున్నా పుత్ర వ్యామోహంతో ఆయన తీసుకునే చర్యలు ఏ ఏ పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి. ఇదంతా కాదని.. రాష్ట్ర ప్రగతికి నడుంబిగించిన జనసేనకు తన మద్దతునిచ్చి పుత్రవ్యామోహాన్ని పక్కకునెట్టి సరికొత్త రాజనీతిజ్ఞుడిగా త్యాగానికి పూనుకుని జనసేనకు భేషరతు మద్ధతు ప్రకటిస్తే ఆయన చెప్పుకునే విజనరీ అనే మాటకి పరిపూర్ణత సంతరించుకుంటుంది. రాష్ట్రం మరలా నూతన వైభవానికి చేరువచేసే తనవంతు సాయంలోని త్యాగాన్ని రాజకీయాలు చరిత్రలో పదిలపరుచుకుంటాయి.
#Written By
భాను శ్రీమేఘన.. భానుడు..
ట్విట్టర్ ఐడి : @ravikranthi9273
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com