తిరుపతి, మార్చి31 (జనస్వరం) : మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి వారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చిన తిరుపతి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జిల్లాలో వైసీపీ పాలనకు సంబంధించిన పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. రాబోవు రోజుల్లో వైసీపీ అరాచక పాలన నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ ని తీసుకువచ్చే విధంగా జనసేన బీజేపీ టీడీపీ కలిసికట్టుగా పని చేసి కూటమిని గెలిపించుకునేలాగా పలు అంశాలపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.