ఆళ్లగడ్డ ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాటలను తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబంలో మీ తాతకి ఎన్ని పెళ్లిళ్లు, బాబాయ్ కి ఎన్ని పెళ్లిళ్లు, మీ చెల్లికి ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు అని మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగతల జీవితాల గురించి ఏరోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా అని ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారికి వారి తల్లిదండ్రులు సంస్కారం నేర్పారని నీలాగా సంస్కారహీనంగా మాట్లాడరని హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని గుడ్డిగా నమ్మి 151 ఎమ్మెల్యే సీట్లు 30 పార్లమెంట్ సభ్యులు నుంచి కూడా పదేపదే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీ చేతగానితనానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని తెలియజేశారు. ఇంత ప్రజా మద్దతు బలం ఉన్న మీరు చైతన్యతే ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం చేయండి అని సూచించారు.
నిరుద్యోగ ఉద్యోగ యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇచ్చారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు చేశారా అని ప్రశ్నించారు. ఇవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్యాకేజీ ఇస్తారు దత్తపుత్రుడు పెళ్లిల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడం తప్ప ఏం చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవద్దని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కొద్ది మంది వాలంటీర్ల మీద మాట్లాడిన వ్యాఖ్యలకు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో వాలంటరీల ముసుగులో వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో ఉన్నటువంటి బ్యానర్లను కాల్చి చెప్పులతో దాడి చేశారని మీరు అవమానపరిచింది పవన్ కళ్యాణ్ గారిని ఒకరిని కాదని మెగా అభిమాల ఆత్మగౌరవాన్ని మీద దెబ్బ కొట్టిన ఆళ్ళగడ్డ స్థానిక ఎమ్మెల్యే ఓటమిని ఆళ్ళగడ్డ జనసైనికులు బాధ్యతగా తీసుకుంటామని 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం సాధించబోతున్నామని వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా జన సైనికులు బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మహబూబ్ బాషా, వెంకటసుబ్బయ్య, కుళాయి రెడ్డి, నయమత్ ఖాన్ ,లోకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com