
పల్నాడు ( జనస్వరం ) : చంద్రబాబు అరెస్టుతో జగన్ తన భయాన్ని బయటపెట్టుకున్నారని.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని వైసిపి నేతలంతా భయంతో గడగడ వణికిపోతున్నారని అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసిపికి ఓటమి తప్పదని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. అందుకే ప్రజా సమస్యలను గాలికొదిలి, పాలనను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.