Logo
Date of Publish : 22 November 2022, 3:11 pm
Editor : Sake Naresh

అరకు – పెద వాకపల్లి గ్రామస్తులంతా జనసేనపార్టీలోకి చేరికలు

               అరకు ( జనస్వరం ) : చినవాకపల్లి ని ఆదర్శంగా తీసుకున్న పెద వాకపల్లి. అల్లూరిసీతారామారాజు జిల్లా జి.మాడుగుల మండలం నుర్మాతి పంచాయితి పెదవాకపల్లిలో మండల జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జనసేనపార్టీ చేరికలు. ఈ  సమావేశంలో ముఖ్య అతిధిగా పాడేరు జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య హాజరయ్యారు. చిన వాకపల్లి గ్రామస్తులందరు గత ఏడాదిలో మూకుమ్మడిగా జనసేనపార్టీ లో చేరడం పాఠకులకు తెలిసిందే. ఆ గ్రామస్తులకు ఆదర్శంగా తీసుకుని ఈరోజు పెద వాకపల్లి గ్రామస్తులందరు జనసేనపార్టీలోకి చేరారు. స్వయంగా వంపూరు గంగులయ్య గారు కండువాలు కప్పి గ్రామస్తులందరికి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు మహిళలు మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ప్రభుత్వాలు కూడా మాకు సహాయం చేయలేదని మా ఆత్మగౌరవాన్నీ కేవలం రాజకీయలబ్ధికోసమే ఉపయోగించుకున్న పార్టీలు చూసేసామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారధ్యాన్ని నమ్ముతున్నామని, మన ప్రాంతంలో ఆదివాసీ హక్కులు, చట్టాలగురించి తెలిసిన నేతగా గంగులయ్యగారిని నమ్ముతున్నామని అందుకే పార్టీలోకి చేరుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డా.. వంపూరు గంగులయ్యగారు మాట్లాడుతూ మీరందరు ఈ రోజు జనసేన పార్టీ లోకి చేరడం ఎంతో సంతోషించాల్సిన విషయం గతంలో ఈ గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగిందని న్యాయం కోసం పోరాడిన వ్యక్తుల్లో మేము కూడా ఒకరని ఆదివాసీ ఆత్మగౌరవానికి ఈ ప్రభుత్వాలు ఇచ్చే గౌరవము ఎలాంటిదో మీరు నేను ఈ భారతదేశం మొత్తం చూసిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావించి రాజకీయలబ్దిని ఆశించడం వంటి నీతిలేని పనులు జనసేనపార్టీ చెయ్యదు మీ తరుపున ప్రశ్నించడానికి న్యాయం జరిగేలా మా వంతుగా ఎల్లవేళలా పోరాడుతము అనగారిన వర్గాల అభ్యున్నతి,ఆత్మగౌరవం ఈ ప్రభుత్వాలకు పట్టదు మీ అందరి ఆశీర్వాదాలు పలించి చట్టసభల్లో మేము అడుగుపెడితే మన అభివృద్ధి మన సమస్యలు,మనహక్కులు, చట్టాలు, మన సంస్కృతి మన ఆత్మగౌరవానికి భంగం కలిగే ఎటువంటి దుశ్చర్యలైన ఉపేక్షించేది లేదని మేము మాత్రం రాజకీయాలకు అతీతంగా పోరాడతామని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రశ్నించే తత్వం వాకపల్లి యువత తీసుకోవాలని చట్టసభల్లో మన ఆదివాసీల వైపు పోరాడే నాయకులకు అండగా ఉండాలని గతంలో ఎన్నో ఆదివాసీ పోరటాలు చేసిన నేతగా గంగులయ్యగారిని గుర్తించి జనసేనపార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ రాజకీయ విలువలు నచ్చి జనసేనపార్టీ లోకి చేరమని కొర్ర భానుప్రసాద్ తన మాతృభాషలో పెద వాకపల్లి గ్రామస్తులకు తెలియజేసారు. సమావేశం అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన జి.మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ ప్రభంజనం చూపుతుందని అందుకు నిదర్శనమే ఈ రోజు ఏ గ్రామానికి అడుగుపెట్టిన ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. మసాడి సింహాచలం మాట్లాడుతూ యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందేనని అందుకు అధినేత పవన్ కళ్యాణ్ యువతకు దిశానిర్దేశం అనుక్షణం చేస్తూనే ఉన్నారన్నారు.  TV రమణ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయని ప్రజలు మార్పుకోరుకుంటున్నారని తెలిపారు. 2007 లో జరిగిన నాటి దురదృష్టకర సంఘటన తలుచుకుని మహిళలు అప్పట్లో 11 మంది వుండేవాళ్ళమని మా లో ఇద్దరు మహిళలు మానసిక వ్యధతో చనిపోయారని నాటి విషయాలు వంపురు గంగులయ్యగారితో చెప్పుకుంటు కన్నీరు మున్నీరౌతు పెద్దఎత్తున గ్రామస్తులు, యువత, మహిళలు జనసేనపార్టీ లో చేరి నాటి విషయాలు వినతిపత్రం రూపంలో గంగులయ్యగారికి అందించారు. ఈ కార్యక్రమానికి జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కొర్ర భానుప్రసాద్, మసాడి సింహాచలం తల్లే త్రిమూర్తి తల్లే కృష్ణ, సోమన్న, నాగేశ్వరరావు, సూరిబాబు, పాడేరు మండల ఉపాధ్యక్షులు సీసాలి భూపాల్, అశోక్ కిల్లో, అశోక్ సాలేబు, సంతోష్ మజ్జి, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com