
ఒంగోలు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచన మేరకు స్థానిక నాయకులు నరసింహారావు, పి. రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 45వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరా కాలనీ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి పాలన లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అలానే పెద్దలు మాట్లాడుతూ నీతిమంతుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా బిడ్డల భవిష్యత్తు కోసం మద్దతు తెలియజేయటానికి సిద్ధంగా ఉన్నామని, అలానే యువత మాట్లాడుతూ ఈసారి మా యువత అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని, ఆడబిడ్డలు మాట్లాడుతూ పవన్ అన్నకే మా మద్దతు అనీ అన్నారు. ఇలా జగన్ రెడ్డి పోవాలి పవన్ అన్న రావాలి నినాదంతో జనచైతన్య యాత్ర 9వ డివిజన్ ఇందిరా కాలనీ లో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, వీర మహిళ మాదాసు సాయి నాయుడు మరియు జనసేన నాయకులు జనసేవ శ్రీనివాస్, ఆనంద్ సాయి, మధు సిద్దవరపు, ఎమ్.సుమంత్, కార్తీక్ సాయి, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు