విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన మహేష్ గారు తన పార్టీ కార్యాలయం నుండి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ గారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టే తిరుగుతున్నాయని వారాహి యాత్ర విజయవంతం కావడం అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ప్రజలకు తెలియపరిచి తద్వారా ప్రజల్ని చైతన్యపరిచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే హక్కు వాలంటీర్ల వ్యవస్థకు లేదని పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేయడం వల్లే వైసిపి నాయకులు గాని మంత్రులు గాని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని మీ మీద 13 సిబిఐ కేసులు ఉన్నాయని మూడు ED కేసులు ఉన్నాయి. 16 నెలలు జైలు జీవితం గడిపిన మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తారా అని అదేవిధంగా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి మీరు పెద్ద యెత్తున ముడుపులు ఇచ్చారా లేదా అని అన్నారు. ఆ ముడుపులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేక అధికారి చేత పంపించారా లేదా అని ఇటువంటి అంశాలు అన్నిటిని కూడా అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారన్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రాధాన్యతను చూసి వైసిపి నాయకులకి వారి ఓటమి స్పష్టంగా తెలిసిపోయిందని వారికి వారి భవిష్యత్తు ఏంటో అర్థమైందని అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాగానే ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారి మీద వైసిపి నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రాసిక్యూట్ చేయాలని కుట్రపూరితంగా జీవో నెంబర్ 16 జారీ చేయడం జరిగిందని దీనివల్ల పవన్ కళ్యాణ్ గారి ఎడమకాలు వెంట్రుక కూడా కదలదని అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత ఉందా, వాలంటీర్ వ్యవస్థకి హేడ్ ఎవరని రాష్ట్ర ప్రభుత్వ మా లేక ఎమ్మెల్యే నా, ఎంపీ నా కలెక్టర్ న అని పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదని అన్నారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో నాగేంద్ర అనే వాలంటీర్నీ వైసిపి నాయకుడు కొడితే ఇంతవరకు వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదని అదేవిధంగా ఎంతోమంది కి అండగా నిలబడే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలితే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఎవరూ కూడా మిమ్మల్ని ఉపేక్షించరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నానని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com