గాజువాక ( జనస్వరం ) : అనేక ప్రమాదాలకు వేదికైనటువంటి చిన గంట్యాడ జగ్గు జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న గోతుల్లో మొక్కలు నాటి వినూత్నమైన నిరసన కార్యక్రమం జనసేన - తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. CM జగన్మోహన్ రెడ్డి ద్యాసంతా ల్యాండ్, సాండ్, మైన్, వైన్ పైనే రహదారులు గూర్చి ఆయన పట్టించికోరు అలాగే గాజువాక నియోజకవర్గంలో స్థానిక MLA నాగిరెడ్డి గంగవరం పోర్టు ముడుపులు వేటలోనే మునిగితేలుతున్నారు ఆయనకి రోడ్లు గురించి అలోచించే సమయంలేదని జనసేన పార్టీ పిఎసి సభ్యులు, విశాఖ అర్బన్ సమన్వయకర్త, గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ కోన తాతారావు, టిడిపి వైజాగ్ పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ MLA పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్వహణ వైపల్యంతో ప్రమాదాలకు వేదికగా ఉన్న బిసి రోడ్డు,జగ్గు జంక్షన్ రోడ్డుని జీవీఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదిక నిర్మాణం చేయని యెడల GVMC జోనల్ కార్యాలయం ముట్టడిస్తామని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ల ఐక్య పోరాటము తో ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజవర్గం జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గడసల అప్పారావు, తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జనసేన రాష్ట్ర నాయకులు తిప్పల రమణారెడ్డి. జీవీఎంసీ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు.జనసేన డిప్యూటీ ప్లోర్ లీడర్ దల్లి గోవింద రెడ్డి, జనసేన నాయకుల గంధం వెంకటరావు. మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంత లక్ష్మి. జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయకుమార్, జనసేన వార్డు అధ్యక్షులు కరణం కనకారావు, రౌతు గోవింద్,లంకల మురళీదేవి, సోమశేఖర్, కోన చిన అప్పారావు, స్వర్ణ 71 వార్డ్టిటీ డి పి ఇన్చార్జ్, పప్పు శంకరావు,72 వార్డు అధ్యక్షులు వి. పూర్ణచంద్రరావు. 73 వార్డు టిడిపి నాయకులు సింగూరి అనంత. నియోజవర్గ తెలుగు యువత నాయకులు బలగ బాలు నాయుడు, జనసేన-టిడిపి నాయకులు, అధిక సంఖ్యలో జనసేన మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com