ఆముదాలవలస ( జనస్వరం ) : భావనపాడు కోర్టు ప్రభావిత ప్రాంతాల్లో అఖిలపక్ష రాజకీయ పార్టీలు నేతలు ఈనెల 16న తేదీన పర్యటించాలని నిర్ణయించారు. బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేడాడ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ప్రజలు ఆమోదం లేకుండా పోలీసులు పరహాల మధ్య భూసేకరణ చేయడం ఇల్లు కొలతలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంటి యజమాని అనుమతి లేకుండా కొలతలు తీసుకోవడం భూసేకరణ ఆపాలని గ్రామం నుంచి పోలీసులు వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పీఎంజే బాబు, డి గోవిందరావు, బలం శ్రీరామ్ మూర్తి, తాండ్ర ప్రకాష్, మల్లిబాబు, కృష్ణమూర్తి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com