Logo
Date of Publish : 06 February 2022, 3:47 pm
Editor : Sake Naresh

మండపేటలో అఖిలపక్షం సమావేశం, జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు

     తూర్పు గోదావరి ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గన్ని నూతనంగా రాజమహేంద్రవరంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక రైస్ మిల్లర్లు అసోసియేషన్ హాల్లో అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా రాజమహేంద్రవరం జిల్లాలో మండపేట ఉండాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పునర్విభజన చేయాలన్నారు. ఇప్పటికే మండపేట నియోజకవర్గనికి సంబంధించిన అంశాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమన్నారు. ఆయన తక్షణమే స్పందించి జిల్లాల పునర్విభజన ప్రక్రియలో అన్ని నియోజకవర్గాల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పార్టీలు నాయకులు, సంఘాల నాయకులు, తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com