
ఏలూరు ( జనస్వరం ) : ప్రపంచంలో భారతీయులందరూ సంస్కృతి, సంప్రదాయాలను, కలబోసుకుని ప్రజా శ్రేయస్సు కోరే విధంగా తమ కార్యకలాపాలను నిర్వహించాలని వాటికన్ సిటీఅంబాసడర్ లియో పోర్డ్ గిరెల్లి అన్నారు. గురువారం ఉదయం స్థానిక బిషప్ హౌస్ లో జరిగిన ఆహ్వాన సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, జనసైనికులు కలిసి లియో పోర్డ్ గిరెల్లి ని అయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత విషయంలో, ప్రాంతీయత విషయంలో మనమందరం క్రీస్తు బోధనల సారాంశానికి అనుగుణంగా నడుచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు, జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు,నగర ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, గుబ్బల నాగేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు,బోండా రాము నాయుడు, కొనికి మహేష్,సుందరనీడి శివశంకర్, తోట దుర్గా ప్రసాద్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.