
అనంతపురం అర్బన్, (జనస్వరం) ; జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500 రూపాయలకే 5,00,000-/-లక్షల ప్రమాద భీమా, ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000-/-రూపాయలు వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలని ముఖ్యంగా యువకులు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నాగేంద్ర, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.