అనంతపురం ( జనస్వరం ) : ఆల్ ఇండియా ప్రజాసేవ హక్కుల పోరాట సమితి 7 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. PHPS అధ్యక్షులు మన్నెపాకుల మాధవ ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ హాజరయ్యారు. దంపెట్ల శివ మాట్లాడుతూ 7 వార్షికోత్సవం జరుపుకుంటున్న PHPS అధ్యక్షులు మాధవ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 140 కోట్ల మందికి ఒక్క అంబేద్కర్ పుడితే, మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం మన జాతి అంతా కలసి ఒక అంబేద్కర్ కాలేమా అని తన నినాదాన్ని తెలియజేసారు. తరువాత PHPS మాధవ ఆధ్వర్యంలో ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం వార్షికోత్సవానికి విచ్చేసిన వారందికి ట్రస్ట్ తరుపున చైర్మన్ దంపెట్ల శివ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com