నెల్లూరు, (జనస్వరం) : ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా భక్తుల కోరికలు తీరుస్తున్న నెల్లూరు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బారా షహీద్ దర్గా రొట్టెల పండగను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. జనసేన పార్టీ, జనసేన నాయకులు గెలిచి అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా గెలవాలని ఏపీ ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలెవరూ సుఖసంతోషాలతో లేరని పెరిగిన ధరలు, ఉపాధి లేక, రోడ్లు, ట్రాఫిక్ వంటి అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలందరూ సమస్యలతో సతమతమవుతున్నారు అని, వారి సమస్యలను తీర్చేందుకు జనసేన పార్టీ నాయకులు గెలిచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని ఎంతోమంది కోర్కెలు తీరుస్తున్న బారాషహీద్ దర్గాలో ఈ రోజు కోరుకున్నామనీ, ప్రజల శ్రేయస్సును కోరి అమరులైన బారాషహీద్ వీరులు మా కోరికను మన్నిస్తారు అనుకుంటున్నాము, ప్రజలందరూ స్వచ్ఛందంగా జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రానున్నది జనసేన ప్రభుత్వమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తో పాటు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, మహిళా నాయకురాలు ఆలియా, పాదర్తి సుకన్య, కొండాపురం కస్తూరి, ప్రవళిక, రేవతి, సుధీర్ కలువాయి ఏ ఆర్ రెహమాన్, శ్రీకాంత్, హేమ చంద్ర, సుమంత్, నరేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.