నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 298వ రోజున 16వ డివిజన్ గుర్రాలమడుగుసంగంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అందరి చూపు పవన్ కళ్యాణ్ గారి పైనే ఉందని, ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్ర రాజకీయాలకు ఆయన ఎలా దిశానిర్దేశం చేస్తారనే దాని పైనే ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా స్వార్ధపూరితంగా ఆలోచించరని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నిర్ణయం ఏదైనా ఉంటుందని అన్నారు. ఇప్పటికే అనేక వర్గాలను సంఘటితం చేస్తూ, ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తున్న పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారని, ఆ యజ్ఞంలో అందరం భాగస్వామ్యం అవుదామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.