Logo
Date of Publish : 07 February 2023, 3:03 pm
Editor : Sake Naresh

సర్వేపల్లి కాలవ కట్టపై అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి : జనసేన నాయకులు గునుకుల కిషోర్

       నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు రూరల్ 18 డివిజన్ జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ హరనాధపురం జనసేన కార్యకర్త వర్షన్ కుటుంబ సభ్యులు మద్దతును తీసుకొని ఆ ప్రాంతంలో జనసేన పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది. సర్వేపల్లి కాలవ కట్టపై అర్హులైన పేదలకు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ అందించలేదని, కొంతమందికి అసలు నమోదు కూడా జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లోనే పూర్తయిన ఇల్లు కూడా ఇంకా పేదలకు అందివ్వకుండా జాప్యం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. కొంతమంది అర్హులైన పేదలకు ఇల్లు నమోదు చేసుకోలేదు. మరి కొంతమందికి నమోదు చేసుకుని నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదని తెలిపారు. వాయిదాలు వేసుకుంటూ పోతున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు తేదీ అనౌన్స్ చేస్తే తప్ప పేదలకు ఇల్లు ఇచ్చేటట్లు లేదనిపిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు వర్షన్, పవన్, మణి, ప్రశాంత్ గౌడ్, కంథర్, ప్రసన్న, శరవణ, షాజహన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com