ఏలూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని కలిసి మొన్న కుప్పంలో ఆయన మీద జరిగినటువంటి, ప్రజాస్వామ్యం మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాలు అన్నింటి మీద పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబు నాయుడును కలిశారో లేదో గాని ఈ గజ్జి కుక్కలన్నీ మీద పడిపోయాయి. వాళ్ళకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏమి పాకిస్తానీ నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా! మరి ప్రతిపక్షం మీద దాడులు చేయటం మీద, ఒకరికొకరు ప్రజాస్వామ్యం మీద సపోర్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ రాష్ట్ర సంపదని దోపిడీదారులకు, లూటీ దారులకు వెళ్లకుండా రక్షించి ప్రజలకు అందించేటటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ అధ్యక్షుడిని కలిశారే తప్పించి ఏమీ లేకుండానే ఈ గజ్జి కుక్కలన్నీ అప్పుడే మీద పడి రెక్కే పరిస్థితుల్లో ఈరోజున పోస్టింగులు పెట్టి అనేక రకాలైనటువంటి రాద్ధాంతాలు చేస్తున్నాయని ఇది సరైన విధానం కాదని రెడ్డి అప్పల మండి పడ్డారు. ఈరోజున ప్రజా సంఘాలను కానీ, ప్రతిపక్షాలను కానీ మాట్లాడనివ్వకుండా వారి గొంతు నొక్కి వారి పైన దాడులు చేస్తూ కేసులు పెడుతూ అనేక రకాలుగా ప్రజలను, ప్రజాసంఘాలను, ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవర్ని మాట్లాడనివ్వకుండ నియంత్రించేటువంటి ప్రక్రియను వైయస్సార్ పార్టీలో జరుగుతున్నందుకు ఈరోజున కక్షగా ఆయన కుప్పంలో జరిగిన విషయం మీద తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ రోజున హైదరాబాద్ లో ఉన్నారు కనుక వెళ్లి చంద్రబాబు నాయుడుని కలిశారన్నారు. దీనిని కూడా వైసీపీ రాజకీయం చేస్తూ మరోలాగా ఆయన ఏదో పాకిస్తాన్ వ్యక్తి లాగా, పాకిస్తాన్ కి ఇండియాకి గొడవల ఉన్నాయి. పాకిస్తాన్ వ్యక్తిని కలవడం ఏంటి అన్నట్టుగా ఈరోజున ఈ గజ్జి కుక్కలన్నీ కూడా మీద పడి రక్కే పరిస్థితి ఉన్నాయి. దీనిని తీవ్రంగా జనసేన పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నామని జనసేన పార్టీ నుండి మేము కూడా ఆయనకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము అని అన్నారు.