విజయవాడ ( జనస్వరం ) : చిట్టినగర్ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పశ్చిమ నియోజకవర్గ బీసీ సామాజిక వర్గాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం పశ్చిమ నియోజకవర్గ యువ బీసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన. వెంకట మహేష్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి 20 కు పైగా బీసీ సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ అధికారానికి దూరం చేస్తున్నారని, సీఎం జగన్ బీసీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16800 మంది బీసీలను ప్రజా ప్రతినిధులు కానివ్వకుండా దెబ్బ కొట్టారని, బీసీ సబ్ ప్లాన్ నిధులను బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఒక్క పైసా కూడా వినియోగించ లేదని, బిసి కార్పొరేషన్లు వలన ఉపయోగం లేదని, చేతి వృత్తి పనులు చేసుకునే వారికి ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, కమ్యూనిటీ హాల్స్ కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న కనీసం పరిశీలించలేదని ఒక్క సామాజిక వర్గానికి కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం స్థలం కేటాయించలేదని, వైసిపి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసి బీసీలను మోసం చేసిందని అటువంటి వైసిపి పార్టీకి రాబోయే ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్పాలని, సమాజంలో మార్పు కోసం బలంగా కృషి చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలంతా ఒక్క తాటిపైకి అండగా నిలబడతామని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ కు బిసి సామాజిక వర్గాల మద్దతు తో పాటు అన్ని వర్గాల మద్దతు కూడగట్టి పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోతిన మహేష్ ను భారీ మెజారిటీతో గెలిపించి తీరుతామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారి నిత్యం కృషి చేస్తున్నారని బీసీలకు అండగా నిలబడతారని బీసీ సమస్యలపై బలమైన గొంతుక వినిపిస్తున్నారని, చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని, బీసీలంతా ఒక్క తాటిపైకి వచ్చి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి జనసేన పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ ప్రతినిధుల తీర్మానం మేరకు అతి తొందరలోనే బీసీ సభ ఏర్పాటు చేస్తామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com